
ఎనిమిది మంది వైద్యులపై కలెక్టర్‌కు నివేదిక
మిర్యాలగూడ అర్బన్ : మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిని ఈ నెల 1న సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్ ఆకస్మిక తనిఖీ చేసిన సమయంలో విధులకు గైర్హాజరైన ఎనిమిది మంది వైద్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పూర్తి నివేదికను కలెక్టర్ ఇలా త్రిపాఠికి అందించారు. ఆస్పత్రిని తనిఖీ చేసే సమయంలో డాక్టర్లు స్పందన, భానుప్రసాద్, వీరజ, ప్రజ్ఞరెడ్డి, ప్రసూన, రోహిత్, సంతోష్‌కుమార్, విజయ్‌కుమార్ విధులు రాలేదు. వీరు విధులకు సరిగా హాజరుకాకపోవడంతో ఆస్పత్రికి వచ్చిన రోగులు వారికోసం వేచి ఉన్నట్లు గుర్తించామని వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ నివేదికలో పేర్కొన్నారు.
కులగణన చరిత్రాత్మక నిర్ణయం
నల్లగొండ టూటౌన్ : బీసీ కులగణన చేపట్టాలని కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మక నిర్ణయమని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్‌గౌడ్, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్‌రెడ్డి అన్నారు. దేశ వ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ ఓబీసీ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని పూలే విగ్రహం వద్ద ప్రధానమంత్రి మోదీ ప్లెక్సీకి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో నాయకులు వీరెల్లి చంద్రశేఖర్, పిల్లి రామరాజుయాదవ్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పిట్టల శ్రీనివాస్, ఏరుకొండ హరి, కనకయ్య, మిరియాల యాదగిరి, ఆవుల మధు, కోటి, శేఖర్, చింత ముత్యాల్‌రావు, పబ్బు నరేందర్, వెంకటేశ్వర్లు, పిన్నింటి నరేందర్‌రెడ్డి, గడ్డం మహేష్, పకీరు మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కళాభారతి నిర్మించాలి
రామగిరి(నల్లగొండ): జిల్లా కేంద్రంలో సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు కళాభారతి నిర్మాణం వెంటనే చేపట్టాలని నల్లగొండకు చెందిన పలువురు కవులు, కళాకారులు సామాజికవేత్తలు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం నల్లగొండలోని టీఎన్జీఓ భవన్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం చేశారు. ఈ సందర్భంగా సాహితీ మేఖల జిల్లా అధ్యక్షుడు పున్న అంజయ్య, కోమలి కళా సమితి అధ్యక్షుడు బక్క పిచ్చయ్య మాట్లాడుతూ కళాభారతి నిర్మాణం కోసం గత ప్రభుత్వం కళాభారతి కోసం రూ.90 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. సృజన సాహితీ అధ్యక్షుడు పెరుమాళ్ల ఆనంద్, డాక్టర్ తండు కష్ణ కౌండిన్య, ఉనికి సామాజిక సాంస్కృతిక వేదిక అధ్యక్షుడు బండారు శంకర్, కవితా దోస్తాన్ అధ్యక్షుడు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, ప్రముఖ కథా రచయిత శీలం భద్రయ్య, సామాజికవేత్తలు పన్నాల గోపాల్ రెడ్డి, భీమార్జున్ రెడ్డి సాహిత్య నాట్యమండలి అధ్యక్షుడు రంగనాయకులు, జనరంజని కళావాహిని అధ్యక్షుడు గజవెల్లి సత్యం కవులు డాక్టర్ సాగర్ల సత్తయ్య, శీలం భద్రయ్య, కోమటి మధుసూదన్, రావిరాల అంజయ్య, కళాకారులు రఘు, ఏం లక్ష్మీనరసింహారావు, భాస్కర్, రమేష్, గంటెకంపు గణేశ్ పాల్గొన్నారు.

ఎనిమిది మంది వైద్యులపై కలెక్టర్‌కు నివేదిక