మద్దతు ధర చెల్లింపులో ప్రభుత్వాలు విఫలం
మిర్యాలగూడ: రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమాయ్యయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. గురువారం మిర్యాలగూడ పట్ట ణంలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మిల్లుల్లో అమ్ముకున్న ధాన్యానికి ప్రభుత్వం రూ.500 బోనస్ అందించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నర సంవత్సరాల్లో రెండు సీజన్లు అయ్యాయని, ఇప్పటి వరకు రైతులకు రైతుభరోసా అందించలేదని, వచ్చే సీజన్ నాటికై నా మొత్తం చెల్లించాలని అన్నారు. పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేష్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, జగదీశ్చంద్ర, రవినాయక్, బావండ్ల పాండు, తిరుపతి రామ్మూర్తి, అంజాద్, పాదూరి గోవర్ధని, వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ, రామారావు పాల్గొన్నారు.
ఫ జూలకంటి రంగారెడ్డి


