డెడ్‌ స్టోరేజీకి చేరువలో సాగర్‌ | - | Sakshi
Sakshi News home page

డెడ్‌ స్టోరేజీకి చేరువలో సాగర్‌

Apr 6 2025 1:45 AM | Updated on Apr 6 2025 1:45 AM

డెడ్‌ స్టోరేజీకి చేరువలో సాగర్‌

డెడ్‌ స్టోరేజీకి చేరువలో సాగర్‌

నాగార్జునసాగర్‌ జలాశయం

నాగార్జునసాగర్‌: సాగర్‌ జలాశయం డెడ్‌ స్టోరేజీకి చేరువలో ఉంది. ప్రస్తుతం 517 అడుగులకు చేరింది. 144.7570 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అయితే, ప్రాజెక్టులో నీటిమట్టం 510 అడుగులకు(131.6690 టీఎంసీలు)కు చేరితే డెడ్‌ స్టోరేజీగా పరిగణిస్తారు. సుమారు 13టీఎంసీల నీటిని వినియోగిస్తే కనీస డెడ్‌ స్టోరేజీకి చేరుకుటుంది. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 23వ తేదీ వరకు కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేయాల్సి ఉంది. ఆ తర్వాత పంటలకు నీరు బంద్‌ చేసినా.. మళ్లీ వర్షాలు కురిసి కృష్ణానదికి వరదలు వచ్చే వరకు తాగునీటి అవసరాలకు నీరు విడుదల చేస్తునే ఉండాలి. సాగర్‌ జలాశయం గరిష్ట నీటిమట్టం 590 అడుగులు(312.450టీఎంసీలు). డిసెంబర్‌ 15వ తేదీన సాగర్‌ జలాశయంలో నీరు 580.80 అడుగులు(285.3216టీఎంసీలు) ఉంది. మూడు నెలల్లో నీటి వినియోగం అధికం కావడంతో నీటిమట్టం గణనీయంగా పడిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement