పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం | - | Sakshi
Sakshi News home page

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Sep 30 2024 1:12 PM | Updated on Sep 30 2024 1:12 PM

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

మద్దిరాల: మండల పరిధిలోని గోరెంట్ల గ్రామ జెడ్పీహెచ్‌ఎస్‌లో ఆదివారం 1991–96 బ్యాచ్‌ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఆరు నుంచి పదో తరగతి వరకు చదివిన విద్యార్థులు 28 ఏళ్ల తర్వాత ఒక్కచోట కలుసుకుని ఒకరికొకరు యోగక్షేమాలు తెలుసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. చదివిన బడి, పరిసరాలను చూసి భావోద్వేగానికి గురయ్యారు. నాడు గురువులు నేర్పిన క్రమశిక్షణ, చదువుతో ఈరోజు వివిధ స్థాయిల్లో ఉన్నామని తెలిపారు. ఈ సదర్భంగా తమకు పాఠాలు చెప్పిన గురువులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్‌ ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement