
వైన్స్ వద్ద బారులుదీరిన మద్యం ప్రియులు
అర్వపల్లి: అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఆదివారం మద్యం దుకాణాలను బంద్ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో మందుబాబులు ముందస్తుగా శనివారం మద్యం కొనుగోళ్లకు దుకాణాల వద్ద బారులుదీరారు. అర్వపల్లిలో 3 మద్యం దుకాణాలుండగా శనివారం రాత్రి మద్యం కోసం ఎగబడ్డారు. మరికొద్ది గంటల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనుండడంతో వివిధ పార్టీల శ్రేణులు విజయోత్సవాలు జరుపుకోవడానికి మద్యాన్ని ముందస్తుంగా కొనుగోలు చేసి నిల్వ పెట్టుకున్నట్టు సమాచారం. జిల్లాలోని అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొడడంతో శనివారం రాత్రే ఆయా దుకాణాల్లో మద్యం స్టాక్ అయిపోయినట్టు సమాచారం.