
అర్జీలు స్వీకరిస్తున్న అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు
నల్లగొండ : ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిష్కారించాలని అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వాటిని ఆయా శాఖల అధికారులకు పంపించి.. పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ, పంచాయతీ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, మత్స్య శాఖ, వైద్య ఆరోగ్యశాఖలకు సంబంధించి ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి.
కొనుగోలు చేసిన భూమి ఇప్పించండి
మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామానికి చెందిన బుచ్చాల కరుణశ్రీ, భర్త మల్సూర్ వద్ద సర్వే నెంబర్ 744/4లో ఎకరం 12 గుంటల భూమిని 2016లో కొనుగోలు చేశాం. పాస్‌బుక్ కూడా వచ్చింది. కానీ కబ్జా ఇవ్వడంలేదు. కొనుగోలు చేసిన భూమిని వెళ్తే చంపుతామని బెదిరిస్తున్నారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నా న్యాయం జరగడంలేదు. వారి నుంచి భూమిని ఇప్పించాలి.
–తూమాటి ప్రమీలారాణి, మిర్యాలగూడ
ఫ అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు
