
మైసయ్య విగ్రహానికి నివాళులర్పిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
నల్లగొండ టూటౌన్ : రానున్న ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 12 స్థానాల్లో బీజేపీ గెలుపొందడం ఖాయమని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం గుండగోని మైసయ్యగౌడ్ 24 వర్ధంతి సంద్భంగా నల్లగొండలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మైసయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ పేదల పక్షాన పోరాడే ప్రజా నాయకులను చంపిన నక్సలైట్లు కాలగర్భంలో కలిసిపోయారని తెలిపారు. ప్రజల కోసం పోరాడిన మైసయ్యగౌడ్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలందని మోసం చేయడమే తప్ప ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయలేదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో నాయకులంతా ఐక్యంగా పని చేస్తే బీజేపీని గెలిపించేందుకు ప్రజలందరు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ముగ్గురు ఎంపీలతో మొదలై 300 ఎంపీల స్థాయికి ఎదిగిన బీజేపీ తెలంగాణలో అధికారంలోకి పెద్ద కష్టం కాదన్నారు. అనంతరం మైసయ్యగౌడ్ కుటుంబ సభ్యులు ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌గౌడ్, జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి, నాయకులు గోలి మధుసూదన్‌రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్, గుండగోని భరత్‌గౌడ్, గుండగోని శ్రీనివాస్‌గౌడ్, పల్లెబోయిన శ్యాంసుందర్, వీరెళ్లి చంద్రశేఖర్, గుండగోని నాగయ్య, నిమ్మల రాజశేఖర్‌రెడ్డి, మొరిశెట్టి నాగేశ్వర్‌రావు, డాక్టర్ నాగం వర్షిత్‌రెడ్డి, నేవర్సు నీరజ, హైమావతి, తార, రావెళ్ల కాశమ్మ, శ్రీదేవి, పాలకూరి రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి