
రూ.కోటిన్నరఖర్చుకు..
నల్లగొండ : విద్యాశాఖలో వివిధ కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం వచ్చి పడింది. నాలుగు రోజుల క్రితం జిల్లా విద్యాశాఖకు రూ.1.61 కోట్లు మంజూరు చేసింది. వాటిని ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా అంటే.. ఈ నెలాఖారులోగా ఖర్చు చేయాల్సి ఉంది. లేకపోతే మార్చి 31 అర్ధరాత్రి 12గంటలకు అకౌంట్లు జీరో బ్యాలెన్స్ అవుతాయి. నిధులుపోతే భవిష్యత్‌లోనూ ఆయా కార్యక్రమాలకు నిధులు మంజూరయ్యే అవకాశం లేదు. దీంతో విద్యాశాఖ అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.
సమగ్ర శిక్షా అకౌంట్‌లో జమ
ఆర్థిక సంవత్సరం నాలుగు రోజుల్లో ముగియనుంది. విద్యాశాఖకు ఆయా కార్యక్రమాల కింద ప్రభుత్వం సమగ్ర శిక్షా అకౌంట్‌లో నిధులు జమ చేసింది. ఆ నిధుల్లో జిల్లాలోని అన్ని మండలాల్లో ఉన్న ఎంఆర్‌సీలకు రూ.10.14 లక్షలు, సీఆర్‌సీలకు రెండో విడత నిధులు రూ.16.50 లక్షలు మంజూరు కాగా.. సైబర్ కాంగ్రెస్ ప్రోగ్రాం కింద రూ.50 వేలు, జీసీఈసీ ప్రోగ్రాం కింద రూ.47,500, 1,31,543 మంది విద్యార్థులకు రెండు యూనిఫాం కుట్టించినందుకు ఒక్కో జతకు రూ.50 చొప్పున రెండు జతలకు రూ.1,31,54,300, ఎఫ్‌ఎల్‌ఎన్ నోడల్ ఆఫీసర్లకు టీఏ కింద రూ.1.86 లక్షలు.. మొత్తం కలిపి 1,61,01,800 మంజూరయ్యాయి.
భవిష్యత్‌లోనూ నిధులు నిలిపివేత..
ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను నిబంధనల ప్రకారం ఖర్చు చేయాలి. మండల స్థాయిలో, క్లస్టర్ స్థాయిలో ఆయా విభాగాల ఽఅధికారులు వెంటనే సమగ్రశిక్షా అకౌంట్ల నుంచి డ్రా చేసి పనులకు చెల్లింపులు చేయాలి. పెండింగ్ ఉన్న బిల్లులన్నీ వెంటనే క్లీయర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వచ్చిన నిధులను ఖర్చు చేయనట్లయితే నిధులన్నీ ఆటోమెటిక్‌గా రద్దు కానున్నాయి. భవిష్యత్‌లోనూ ఆయా కార్యక్రమాలు నిధులను నిలిపివేయనున్నారు. దీంతో ఆయా స్థాయిలో అధికారులు బిల్లుల చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేశారు. అయితే ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో నిధులు విడుదల చేసి వెంటనే ఖర్చు చేయాలని గడువు విధించడంతో వారు కాస్త ఇబ్బంది పడుతున్నారు.
విద్యాశాఖలో ఉరుకులు పరుగులు
ఫ ఆరు రకాల పనుల కింద
రూ.1.61 కోట్లు మంజూరు
ఫ నాలుగు రోజుల క్రితం సమగ్రశిక్షా అకౌంట్లలో జమ
ఫ 31వ తేదీలోగా ఖర్చు చేయాలని గడువు
ఫ లేకుంటే భవిష్యత్‌లోనూ కార్యక్రమాలకు నిధుల నిలిపివేత
నిధులు వెంటనే వాడుకోండి
విద్యాశాఖకకు విడుదలైన నిధులను ప్రభుత్వం నిబంధనల ప్రకారం వాడుకోవాలి. ఏవైతే పనులు చేపట్టారో వాటికి చెల్లింపులు చేయాలి. ఈ నెల 31లోగా చెల్లించకపోతే ఆ నిధులు వెనక్కుపోతాయి. భవిష్యత్‌లోనూ అవి మంజూరయ్యే అవకాశం ఉండదు. గడువులోగా నిధులు ఖర్చు చేయాలి.
– భిక్షపతి, డీఈఓ
