రామగిరి(నల్లగొండ) : పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు పూర్తి చేసిన వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నల్లగొండలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జానకిదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారికి కంపెనీల్లో అధిక ప్రాధాన్యం ఉంటుందని, స్వయం ఉపాధి ద్వారా కూడా స్థిరపడవచ్చని పేర్కొన్నారు. పదో తరగతి పూర్తయిన వారు, ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు www.sbtet.telangana. gov.in వెబ్‌సైట్ ద్వారా ఏప్రిల్ 24వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.