వానాకాలంలో జిల్లాకేంద్రంలోని పలుచోట్ల ప్రధాన రహదారిపై నిత్యం నీరు నిలిచి ఉంటుంది. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ ఉన్నా నీరంతా చెరువులోకి పోతుంది. ప్రతి సంవత్సరం ఇదే జరుగుతున్నా ఎవరూ పట్టించుకుంటలేరు. వరద నీరు వెళ్లేందుకు వీలుగా మార్గం సరిచేయాలి.
– అబ్దుల్ కలీమ్, నాగర్‌కర్నూల్
జిల్లాకేంద్రంలోని నాలాలు, డ్రెయినేజీల నిర్వహణ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడైనా నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న నిర్మాణాలు తొలగిస్తున్నాం. నాలాలపై కల్వర్టుల వద్ద అడ్డుగా ఉన్న వాటిని తొలగించేలా చర్యలు చేపడుతాం. మురుగునీటిని తరలించేందుకు పంపింగ్ స్టేషన్ నిర్మాణం వేగవంతం చేస్తాం.
– నాగిరెడ్డి,
మున్సిపల్ కమిషనర్, నాగర్‌కర్నూల్


