మొదలైన మూడో విడత నామినేషన్ల పర్వం
అచ్చంపేట: గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణలో భాగంగా ఇప్పటికే మొదటి, రెండో విడత నామినేషన్లు పూర్తి కాగా.. బుధవారం నుంచి మూడో విడత నామినేషన్లు అధికారులు స్వీకరించారు. అచ్చంపేట, బల్మూర్, లింగాల, అమ్రాబాద్, పదర, ఉప్పునుంతల, చారకొండ మండలాల పరిధిలోని 158 గ్రామ పంచాయతీలకు గాను 93 మంది సర్పంచ్ అభ్యర్థులుగా, 1,364 వార్డు స్థానాలకు సంబంధించి 90 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి శ్రీరాములు తెలిపారు. ఈ నెల 5వ తేదీ వరకు మూడో విడత నామినేషన్లు స్వీకరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. డెలికేషన్ కమిటీ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేశారని, మూడో విడతలో జిల్లా లోని ఏజెన్సీ మండలా ల్లోని స్థానాలను వంద శాతం ఎస్టీలకే కేటాయించారు.
నామినేషన్ కేంద్రాల
పరిశీలన
ఆయా మండలాల్లో ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. సిబ్బందికి సూచనలు చేయడంతో పాటు ఆయా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కేంద్రాల వద్ద ప్రజలు గుమికూడవద్దని, ఎవరైనా ఎన్నికల కోడ్ అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మండలాలు పంచాయతీలు సర్పంచ్ వార్డులు నామినేషన్లు
నామినేషన్లు
అచ్చంపేట 38 25 312 19
అమ్రాబాద్ 20 09 182 07
బల్మూర్ 23 08 208 08
చారకొండ 17 11 142 21
లింగాల 23 08 206 16
పదర 10 13 92 10
ఉప్పునుంతల 27 19 222 09
మొత్తం 158 93 1,364 90
మండలాల వారీగా.


