పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
కందనూలు: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మదన్‌మోహన్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సైన్స డిగ్రీ కళాశాలలో జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ నేషనల్ గ్రీన్ కాప్స్ ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ ప్రొగ్రామ్ ఆధ్వర్యంలో ఎకో క్లబ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మదన్‌మోహన్ మాట్లాడుతూ వాయు కాలుష్యం వల్ల భవిష్యత్తులో వచ్చే ప్రమాదాల గురించి వివరించారు. అనంతరం పర్యావరణంపై రూపొందించిన పోస్టర్లను ప్రదర్శించారు. కేజీబీవీ విద్యార్థులు, అధ్యాపకులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.


