ని(గె)లిచేదెవరు..? | - | Sakshi
Sakshi News home page

ని(గె)లిచేదెవరు..?

Dec 4 2025 9:00 AM | Updated on Dec 4 2025 9:00 AM

ని(గె

ని(గె)లిచేదెవరు..?

అచ్చంపేట: తొలి విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో తుది జాబితా ప్రకటించి గుర్తులు కేటాయించారు. మొదటి విడతలో కల్వకుర్తి మండలంలోని వెంకటాపూర్‌ తండా, జీడీపల్లి, తెలకపల్లి మండలంలో గట్టురాయపాకుల, ఊర్కొండ మండలం గుంటపల్లి, వంగూరు మండలం కొండారెడ్డిపల్లి, వెల్దండ మండలం కేస్లీతండా, బండోనిపల్లి కలిపి 7 సర్పంచ్‌ స్థానాలు, 144 వార్డుల ఒకే నామినేషన్లు దాఖలు కావడంతో వాటిని ఏకగ్రీవ ఎన్నికగా ప్రకటించడమే మిగిలింది. వాటిని గురువారం కలెక్టర్‌ అధికారికంగా వెలువరించే అవకాశం ఉంది. రెండో దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తి కాగా.. పరిశీలన మంగళవారం, బుధవారం ముగిసింది. మొదటి విడతలో సర్పంచ్‌ స్థానాలకు 967, వార్డులకు 3,355 నామినేషన్లు రాగా.. రెండో విడతలో సర్పంచ్‌కు 1046, వార్డులకు 3,810 నామినేషన్లు వచ్చాయి. నామినేషన్ల స్వీకరణ ప్రశాంత వాతావరణంలో ముగిసేలా పోలీసులు బందోబస్తు నిర్వహించడంతో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగలేదు.

సింగిల్‌ నామినేషన్‌కు..

సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలకు ఒక్కటే నామినేషన్‌ దాఖలైతే ఏకగ్రీవంగా గెలిచినట్లవుతోంది. సదరు అభ్యర్థి స్వీయ ధ్రువీకరణ పత్రం రిటర్నింగ్‌ అధికారి అందజేయాల్సి ఉంటుంది. ఆర్‌ఓ డిక్లరేషన్‌ను పరిశీలించి ఆమోదిస్తేనే ఆ పదవి ఏకగ్రీవమవుతుంది. ఏకగ్రీవమైన పదవుల జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌కు ఆర్వోలు పంపించినట్లయితే గెజిట్‌ విడుదల చేస్తారు. అనంతరం ఏకగ్రీవ అభ్యర్థులు గెలిచినట్లు ధ్రువీకరణ పత్రం ఇస్తారు.

ఉపసంహరణ చేయాలంటే..

ఏకగ్రీవాలకు నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటే పోటీదారులపై తీవ్రమైన ఒత్తిళ్లు ప్రారంభమయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల సంఘం ప్రత్యేక గైడ్‌లైన్స్‌ జారీ చేసింది. నామినేషన్‌ ఉపసంహరించుకునే అభ్యర్థి సంబంఽధిత రిటర్నింగ్‌ అధికారికి ప్రత్యేక ఫార్మాట్‌లో దరఖాస్తు అందించాలి. తానే స్వచ్ఛందంగా నామినేషన్‌ ఉపసంహరించుకుంటున్నానని, ఎలాంటి బెదిరింపులు, ఒత్తిళ్లు, డబ్బు ప్రలోభాలు లేవని స్వీయ ధ్రువీకరణ ఇవ్వాలి. రిటర్నింగ్‌ అధికారి దానికి సంతృప్తి చెందినట్లయితేనే నామినేషన్‌ ఉపసంహరణ చెల్లుబాలు అవుతుంది. ప్రత్యర్థులు ఫిర్యాదు చేసినట్లయితే క్షేత్రస్థాయిలో ఆర్వో విచారణ చేసే అవకాశముంది.

మండలం జీపీలు పోటీదారులు వార్డులు పోటీదారులు

కల్వకుర్తి 24 153 214 603

తాడూరు 24 159 216 547

తెలకపల్లి 28 197 260 623

ఊర్కొండ 16 90 138 354

వంగూరు 27 192 228 555

వెల్దండ 32 176 270 673

మొత్తం 151 967 1,326 3,355

మండలం జీపీలు నామినేషన్లు వార్డులు నామినేషన్లు

బిజినేపల్లి 35 246 324 971

కోడేరు 16 129 156 440

కొల్లాపూర్‌ 18 139 168 426

నాగర్‌కర్నూల్‌ 18 131 178 453

పెద్దకొత్తపల్లి 28 201 258 726

పెంట్లవెల్లి 10 64 92 247

తిమ్మాజిపేట 26 136 236 547

మొత్తం 151 1046 1,412 3,810

పంచాయతీ ఎన్నికల మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ పూర్తి

అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు

డిసెంబర్‌ 11న పోలింగ్‌

రెండో విడత స్క్రూట్నీ..

అభ్యంతరాలు ఉంటే..

సర్పంచ్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియపై ఎవరికై నా అభ్యంతరాలు ఉంటే సరైన ఆధారాలు సమర్పిస్తే ఆర్వోలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. అన్ని పత్రాలు సరిగా ఉంటే ఆమోదిస్తారు లేదా తిరస్కరిస్తారు. ఒకవేళ తిరస్కరణకు గురైతే సదరు అభ్యర్థి ఆర్డీఓకు ఆప్పీలు చేసుకోవచ్చు. రెండు రోజుల నిర్ణీత గడువులోపు పరిష్కరించుకోవాలి.

ని(గె)లిచేదెవరు..? 1
1/2

ని(గె)లిచేదెవరు..?

ని(గె)లిచేదెవరు..? 2
2/2

ని(గె)లిచేదెవరు..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement