నాగర్‌కర్నూల్
సరి, బేసి.. రిజర్వేషన్లు కోసి!
బుధవారం శ్రీ 3 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
అచ్చంపేట: ఆకాశంలో.. అవనిలో.. అన్నింటా సగం అంటూ మహిళామణులను ఆదరిస్తుంటాం. ఇందుకు తగ్గట్టుగానే ఎన్నికల్లోనూ సగం స్థానాలు మహిళలకు రిజర్వు చేస్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో మహిళల కోటా తగ్గడంపై అందరూ విస్తుపోతున్నారు. సగం కంటే ఎక్కువ ఉండరాదనే కొత్త నిబంధనల మేరకు అధికారులు మహిళలకు స్థానాలు విభజించగా.. సర్పంచ్, వార్డు స్థానాల్లో సంఖ్య గణనీయంగా తగ్గింది. రాజకీయంగా మహిళలను చైతన్యవంతులను చేసేందుకు రిజర్వేషన్లు కేటాయించడంతో కొత్తతరం మహిళలు తెరపైకి వస్తున్నారు. ఈ రిజర్వేషన్లు చాలామంది రాజకీయ ఎదుగుదలకు దోహదం చేస్తున్నాయి.
ఇదీ అసలు సమస్య..
సర్పంచ్, వార్డుస్థానాలు సరి సంఖ్య ఉన్నచోట సగం మహిళలకు కేటాయించగా.. బేసి సంఖ్య ఉన్న చోటే సమస్య ఉత్పన్నమవుతోంది. ఆ మండలంలో బీసీ కేటగిరికి 3 స్థానాలు ఉంటే అందులో సగం అంటే 1.5 శాతం అవుతోంది. ఈ లెక్కన సగం శాతం కంటే ఎక్కువ ఉంటే 2 స్థానాలు మహిళలకు, జనరల్‌కు ఒక స్థానం ఇంతకు ముందు కేటాయించేవారు. అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం అలాంటి చోట మహిళలకు 1, జనరల్‌కు 2 స్థానాలు రిజర్వు చేశారు. 7 స్థానాలుంటే 3 మహిళలకు, 4 జనరల్‌కు కేటాయించారు. అదే గతంలో మాత్రం 7 స్థానాలున్న చోట 4 మహిళలకు, 3 జనరల్‌కు రిజర్వు అయ్యాయి. అన్ని కేటగిరిల్లో ఇదే విధానం అమలు చేశారు.
సంఖ్యా విభజనలో
మహిళలకు తగ్గిన స్థానాలు
గతంలో కంటే గ్రామాలు, వార్డులు
పెరిగినా కేటాయించని వైనం


