చివరిరోజు నామినేషన్ల జోరు
● సర్పంచ్‌లకు 441,వార్డు స్థానాలకు 1,881 దాఖలు
● నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ మండలాల్లో అర్ధరాత్రి వరకు కొనసాగిన ప్రక్రియ
సాక్షి, నాగర్‌కర్నూల్: పంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. మంగళవారం నామినేషన్లకు చివరిరోజు కావడంతో క్లస్టర్ కేంద్రాలకు అభ్యర్థులు పోటెత్తారు. సాయంత్రం 5 గంటలు దాటినప్పటికీ క్యూలైన్లలో బారులుదీరిన అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించారు. నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ మండలాల్లో ఈ ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగింది. సర్పంచ్ స్థానాలకు సంబంధించి పెద్దకొత్తపల్లి మండలంలో 121, కోడేరు 70, పెంట్లవెల్లి 40, బిజినేపల్లి 104, తిమ్మాజిపేట 106 నామినేషన్లు వచ్చాయి. వార్డు స్థానాలకు సంబంధించి పెద్దకొత్తపల్లి 461, కోడేరు 317, పెంట్లవెల్లి 170, బిజినేపల్లి 601, తిమ్మాజిపేట మండలంలో 332 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా సర్పంచ్‌లకు 441, వార్డు స్థానాలకు 1,881 నామినేషన్లు వచ్చాయి.


