ఆ సర్పంచ్‌లు, వార్డుసభ్యులు ఏకగ్రీవం
వెల్దండ/ తెలకపల్లి/ ఊర్కొండ: మండలంలోని బండోనిపల్లి, కేస్లీతండా గ్రామ పంచాయతీలకు శనివారం సర్పంచులు, వార్డుసభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బండోనిపల్లి పంచాయతీ జనరల్ మహిళకు రిజర్వు కావడంతో గ్రామస్తులు చర్చించి ఏకగ్రీవం చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు శనివారం సర్పంచ్ అభ్యర్థిగా ఎనుముల సంగీత నామినేషన్ వేశారు. అలాగే వార్డుల వారీగా ఇస్లావత్ కిషన్, ఏకుల శారద, మందగల రాములు, ఎనుముల వెంకట్‌రెడ్డి, కేశమల్ల నాగమ్మ, వావిళ్ల అల్వాల్‌యాదవ్, సత్తూరి విజయలక్ష్మి, కేతావత్ దేవి ఒక్కొక్క నామినేషన్ వేశారు. దీంతో అధికారులు సర్పంచ్‌తోపాటు వార్డు సభ్యులు ఏకగ్రీవమైనట్లు తెలిపారు.
● కేస్లీతండా ఎస్టీ జనరల్ కాగా.. సర్పంచ్ అభ్యర్థిగా మెగావత్ శ్రీనివాసులుతోపాటు వార్డుల వారీగా మెగావత్ అమర్‌సింగ్, మెగావత్ లక్ష్మి, డేగవత్ బిచ్చాని, ఇస్లావత్ భీమ్లా, రాత్లావత్ శాంతి, ముడావత్ సంతోష్, రామావత్ ఉమ, రామా వత్ శ్వేత ఒక్కొక్క నామినేషన్ వేయడంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
● తెలకపల్లి మండలంలోని గట్టురాయిపాకుల గ్రామ సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో విజయ్ అనే వ్యక్తిని ఏ పార్టీకి సంబంధం లేకుండా సర్పంచ్‌గా ఎన్నుకోనున్నట్లు సమాచారం. అలాగే వార్డు సభ్యులను సైతం ఏకగ్రీవం చేసేందుకు గ్రామస్తులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అదేవిధంగా తాళ్లపల్లి గ్రామ సర్పంచ్ సైతం ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
● ఊర్కొండ మండలంలోని గుణగుంటపల్లి పంచాయతీ ఎస్టీ జనరల్‌కు కేటాయించడంతో జర్పులావత్ రమేష్‌నాయక్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే 8 వార్డులకు గాను 4 వార్డులు ఏకగ్రీవం కాగా.. మిగతా 4 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.
ఆ సర్పంచ్‌లు, వార్డుసభ్యులు ఏకగ్రీవం
ఆ సర్పంచ్‌లు, వార్డుసభ్యులు ఏకగ్రీవం


