రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
తిమ్మాజీపేట: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని డీఆర్డీఓ చిన్న ఓబులేషు అన్నారు. శుక్రవారం తిమ్మాజీపేట మండలం కోడిపర్తిలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రానికి వచ్చిన ధాన్యం నాణ్యతను పరిశీలించడంతో పాటు రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. అనంతరం సీ్త్రనిధి రుణాలపై మహిళా సంఘాల బాధ్యులతో ఆయన ఆరా తీశారు. ప్రభుత్వం అందించిన రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా రాణించాలని సూచించారు. డీఆర్డీఓ వెంట ఏపీఎం బి.నిరంజన్, టీఏ రాజేశ్, సీసీ నాగరాజు ఉన్నారు.
నేడు బీఆర్‌ఎస్ దీక్ష దివస్
నాగర్‌కర్నూల్: జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో శనివారం దీక్ష దివస్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో దీక్ష దివస్ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఉదయం 11:30 గంటలకు దీక్షా దివాస్ ప్రారంభమవుతుందని.. జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
నేడు డయల్ యువర్ డీఎం
కల్వకుర్తి టౌన్: కల్వకుర్తి ఆర్టీసీ డిపో పరిధిలోని ప్రయాణికుల సమస్యలను తెలుసుకునేందుకు గాను శనివారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఎం సుభాషిణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ ప్రయాణికులు మధ్యాహ్నం 12 నుంచి 1గంట వరకు 99592 26292 నంబర్‌ను సంప్రదించి.. సమస్యలను తెలియజేయడంతో పాటు ఆర్టీసీ అభివృద్ధికి అవసరమైన సూచనలు చేయాలని కోరారు.
ఉత్తమ సేవలకు ప్రశంస
కల్వకుర్తి రూరల్: పట్టణానికి చెందిన శివకుమార్ చిన్న వయసులోనే సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ జాతీయ యువజన అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఢిల్లీలోని ఐక్యరాజ్య సమితి అధికారిక కార్యాలయంలో ఆ సమితి ప్రతినిధులు సుశీల్ చౌదరి, బిసాతి భరత్‌లు శివకుమార్‌ను ప్రత్యేకంగా అభినందించారు. స్వామి వివేకానంద సేవాబృందం ఆధ్వర్యంలో చేపట్టే సామాజిక సేవా కార్యక్రమాలను వారికి వివరించినట్లు ఆయన తెలిపారు.
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి


