రెండో రోజు నామినేషన్ల జోరు
● సర్పంచ్‌కు 203, వార్డు స్థానాలకు 345 దాఖలు
● నేటితో ముగియనున్న గడువు
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలో మొదటి విడతగా ఎన్నికలు జరిగే గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాలకు రెండో రోజు శుక్రవారం భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. కల్వకుర్తి, తాడూరు, తెలకపల్లి, ఊర్కొండ, వంగూరు, వెల్దండ మండలాల పరిధిలోని 151 గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్ స్థానాలకు 203 నామినేషన్లు దాఖలు కాగా.. 1,326 వార్డు స్థానాలకు 345 నామినేషన్లు వచ్చాయి. ఇప్పటివరకు సర్పంచ్ స్థానాలకు 349, వార్డు స్థానాలకు 407 నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖలు చేసేందుకు శనివారం సాయంత్రం 5 గంటలకు వరకు మాత్రమే సమయం మిగిలి ఉంది. చివరి రోజున పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది.


