లేబర్ కోడ్‌లతో కార్మిక వ్యవస్థ విచ్ఛినం
నాగర్‌కర్నూల్ రూరల్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి న నాలుగు లేబర్ కోడ్‌లు కార్మిక వ్యవస్థను విచ్ఛినం చేసేలా ఉన్నాయని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. కార్పొరేట్ శక్తులకు కార్మికులు ఊడిగం చేసేలా లేబర్ కోడ్‌లు ఉన్నాయన్నారు. లేబర్ కోడ్‌లపై కార్మిక సంఘాలు, ప్రతిపక్షాల అభ్యంతరాలను పట్టించుకోకుండా 29 కార్మిక చట్టాలను రద్దు చేయడం దారుణమన్నారు. కార్మిక వర్గంపై ప్రధాని మోదీ నిరంకుశ వైఖరి అవలంబిస్తున్నారని ధ్వజమెత్తారు. కార్మికలోకం అనేక త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న కార్మిక చట్టాలు కాలగర్భంలో కలిపారని ఆరోపించారు. ఇప్పటికై నా కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జయలక్ష్మి, జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు, పసియొద్దీన్, పొదిల రామయ్య, శివ వర్మ ఉన్నారు.


