వడ్డీలేని రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
కొల్లాపూర్: వడ్డీ లేని రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం కొల్లాపూర్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా మహిళలకు రూ.9.57 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని వివరించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వినియోగించుకొని మహిళలు స్వశక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభు త్వం పంపిణీ చేస్తున్న చీరల పట్ల మహిళలు సంతోషంగా ఉన్నారని, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు చీరలు ఇస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ చిన్న ఓబులేసు, ఆర్డీఓ బన్సీలాల్, తహసీల్దార్ భరత్‌కుమార్ పాల్గొన్నారు.
మహిళా సాధికారతే లక్ష్యం..
అచ్చంపేట: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతే లక్ష్యంగా పనిచేస్తోందని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు. అచ్చంపేటలో నిర్వహించిన కార్యక్రమంలో 3,504 మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్‌లను అందజేసి మాట్లాడారు. మహిళలకు ప్రతి ఏడాది రూ.25 వేల కోట్లకు తగ్గకుండా బ్యాంకు లింకేజీ రుణాలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత, విజయ డెయిరీ చైర్మన్ నర్సయ్యయాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, బల్మూరు మండలాధ్యక్షుడు వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.


