చదువుతోనే మహిళా సాధికారిత సాధ్యం
వీపనగండ్ల: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ విద్యలో రాణించినప్పుడే మహిళా సాధికారిత సాధ్యమవుతుందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో పాన్‌గల్, చిన్నంబావి, వీపనగండ్ల మండలాల మహిళలకు ఇందిరా మహిళాశక్తి చీరలతో పాటు కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తోందన్నారు. మహిళలు దుబారా ఖర్చులు తగ్గించి పొదుపు సూత్రాలు పాటిస్తూ ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహిళలకు రైస్ మిల్లులు, పెట్రోల్ బంకులను మంజూరు చేస్తూ కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో పని చేస్తున్నారని చెప్పారు. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంతో మహిళలు దైవ దర్శనాలు, పర్యాటక ప్రాంతాలు సందర్శించే అవకాశం లభించిందన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు, పాఠశాలలను ఆశ్రయించడంతో గ్రామీణ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులుకు గురవుతున్నాయని.. ప్రభుత్వం అందిస్తున్న వైద్యసేవలు, గురుకులాలను ఉపయోగించుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం చేసిన అధిక అప్పులతో కల్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం అందించలేకపోతున్నామని.. రాబోయే మూడేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో నెరవేరుస్తామని చెప్పారు. సాంకేతిక కారణాలతో అర్హులైన వారిని ఉచిత విద్యుత్, రాయితీ గ్యాస్ సిలిండర్ పథకాలు అందడం లేదని.. అధికారులు సమస్యను గుర్తించి పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ కీమ్యానాయక్, అడిషనల్ డీఆర్డీఓ సరోజ, మూడు మండలాల మహిళా సమాఖ్య మండల అధ్యక్షులు చిట్టెమ్మ, ఇందిర, సురేఖ, ఆయా మండలాల తహసీల్దార్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు


