కూలీ ఖర్చులకు సరిపోదు..
నేను ఈసారి 7 ఎకరాల్లో పత్తి సాగుచేశాను. గతంలో ఎకరాకు పది క్వింటాళ్ల చొప్పున దిగుబడి వస్తే.. ఈసారి కనీసం 5 క్వింటాళ్లు కూడా రాలేదు. అధిక వర్షాలతో పంట దిగుబడి సగానికి పడిపోయింది. పత్తి ఏరేందుకు ఒక్కో కూలీకి రూ.500 చొప్పున ఖర్చు కాగా, పత్తి అమ్మితే కూలీ ఖర్చులకు కూడా సరిపోలేదు. సీసీఐలో నిబంధనల ప్రకారం పత్తి విక్రయించినా క్వింటాల్‌కు రూ.7,600 దాటడం లేదు. – అనంతయ్య, రైతు,
మంథటి, నాగర్‌కర్నూల్ మండలం
నిర్ణీత తేమ శాతం..
రైతులు పత్తి ఏరిన తర్వాత నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకురాకుండా, ఇంటి వద్ద ఆరబెట్టి నిర్ణీత తేమశాతం వచ్చాక తీసుకురావాలి. తేమ శాతం 8 ఉంటేనే సీసీఐ ప్రకారం కనీస మద్దతు ధర అందుతుంది. ఒకరోజు ముందుగానే బుకింగ్ చేసుకుని వస్తే ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు పూర్తవుతాయి.
– స్వరణ్‌సింగ్, జిల్లా మార్కెటింగ్ అధికారి
●


