స్లాట్ బుకింగ్‌పై అవగాహనేది?
ఈసారి సీసీఐ కొనుగోళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం ముందస్తు స్లాట్ బుకింగ్ అమలు చేస్తోంది. ఇందులో భాగంగా కపాస్ కిసాన్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. రైతులు ఏదైనా సీసీఐ కేంద్రంలో పత్తిని విక్రయించాలంటే ఒకరోజు ముందుగానే యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంది. దీనిపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన లేక నేరుగా సీసీఐ కొనుగోలు కేంద్రాలను పత్తిని తీసుకువస్తున్నారు. అలాగే వ్యవసాయ శాఖ వద్ద రిజిస్టర్ ఉన్న నంబర్‌తో స్లాట్ బుకింగ్ చేస్తేనే ఓటీపీ వస్తోంది. రైతు నంబర్ మారినా, ఇది వరకే రిజిస్టర్ కాకపోయినా ఓటీపీ రాకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నిబంధనలు పాటించలేక, అధికారుల కొర్రీలతో చేసేదేమీ లేక ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. ఇదే అదునుగా ప్రైవేటు వ్యాపారులు క్వింటాల్‌కు రూ.6,400 నుంచి రూ.7 వేల చొప్పున కొనుగోలు చేస్తున్నారు.
నాగర్‌కర్నూల్ మండలంలోని గగ్గలపల్లి వద్ద సీసీఐ కేంద్రంలో పత్తి కొనుగోళ్లు


