
పోలీసుల సంక్షేమానికి నిరంతర కృషి
నాగర్‌కర్నూల్ క్రైం: పోలీసుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని.. ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తనను సంప్రదించాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. పెద్దకొత్తపల్లికి చెందిన కానిస్టేబుల్ మహేందర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా.. అతడి కుటుంబానికి మంజూరైన రూ. కోటి చెక్కును బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసు శాలరీ ప్యాకేజీలో అకౌంట్ ఉన్నందున కానిస్టేబుల్ మహేందర్ కుటంబానికి రూ.కోటి ఆర్థికసాయం అందజేశామని తెలిపారు. పోలీసు సిబ్బంది అందరూ తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేసుకొని ఉండాలన్నారు. ఏఎస్పీ వెంకటేశ్వర్లు, ఏఓ కృష్ణయ్య, ఆర్‌ఐ జగన్, ఎస్‌బీఐ రీజినల్ మేనేజర్ సునీత, అచ్చంపేట బ్రాంచ్ మేనేజర్ సయ్యద్ హుస్సేన్ బాషా పాల్గొన్నారు.