
అయ్యప్ప ఆలయంలో అడిషనల్ ఎస్పీ పూజలు
కందనూలు: జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో ఉన్న శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామిని బుధవారం అడిషనల్ ఎస్పీ నోముల వెంకటేశ్వర్లు తన సతీమణి గీతతో కలిసి దర్శించుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకుడు జీవీఎం విజయకుమార్ శాసీ్త్ర వేద ఆశీర్వచనం అందించారు.
జాతీయ వాలీబాల్ టోర్నీకి నల్లమల విద్యార్థి
అమ్రాబాద్: ఎస్‌జీఎఫ్ అండర్–17 జాతీయ వాలీబాల్ పోటీలకు అమ్రాబాద్ మండలం తిర్మలాపూర్ (బీకే గ్రామానికి చెందిన ఎడ్ల వరప్రసాద్ వర్మ ఎంపికయ్యారు. లింగాల గురుకులంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వరప్రసాద్ వర్మ.. ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు సంగారెడ్డిలో జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో ఉత్తమ ప్రతిభకనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడంపై గ్రామస్తులు, వాలీబాల్ క్రీడాకారులు హర్షం వ్యక్తంచేశారు.
108లో ప్రథమ చికిత్స తప్పనిసరి
బిజినేపల్లి: ప్రమాదాల బారినపడి ప్రాణాపా య స్థితిలో ఉండే క్షతగాత్రులకు 108 అంబులెన్స్‌లోనే ప్రథమ చికిత్స అందించాలని 108 రాష్ట్ర క్వాలిటీ అధికారి కిషోర్ అన్నారు. బుధ వారం బిజినేపల్లిలో అంబులెన్స్ వాహనాలను జిల్లా అధికారులతో కలిసి ఆయ న తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంబులెన్స్‌లోని మె డికల్ కిట్లు, ఇతర పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. అత్యవసర కాల్ వచ్చిన 15 నిమిషాల్లోనే అంబులెన్స్‌తో ఘటనా స్థలానికి చేరుకోవాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట ఈఎంఈ జిల్లా అధికారి శ్రీనివాసులు, ఈఎంటీ రవికుమార్, పైలట్ వెంకటయ్య ఉన్నారు.
దరఖాస్తు చేసుకోండి
కందనూలు: కండరాల క్షీణత వైకల్యం కలిగి రోజువారీ కార్యక్రమాలకు ఇతరులపై ఆధారపడే వారికి సపోర్టు అసెస్‌మెంట్ కోసం జిల్లాలో ప్రత్యేకంగా శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమశాఖ అధికారిణి రాజేశ్వ రి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 40 శాతం పైగా శారీరక వికలత్వం కలిగిన వారు సదరం సర్టిఫికెట్, ఆధార్‌కార్డు, ఆధాయ ధ్రువపత్రం, తెల్లరేషన్ కార్డు జిరాక్స్‌తో పాటు రెండు ఫొటోలతో ఈ నెల 30వ తేదీలోగా జిల్లా సంక్షేమశాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
పోరాటాలతోనే
హక్కులు సాధ్యం
అచ్చంపేట: గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతన చట్టం వర్తింపజేయడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు డిమాండ్ చేశారు. బుధవారం అచ్చంపేటలో గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా 3వ మహాసభలను జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ.. కర్ణాటక, కేరళ, చండీఘడ్ రాష్ట్రాల్లో పంచాయతీ కార్మికులను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించి పే స్కేల్ అమలుచేస్తున్నారని చెప్పారు. ఏపీలో రూ. 18వేల వేతనం ఇస్తున్నారన్నారు. తెలంగాణలో మాత్రం పంచాయతీ కార్మికులకు కనీస వేతనం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే కనీసం మట్టి ఖర్చులు కూడా ఇవ్వడం లేదన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్, మల్లేశ్, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎం.శంకర్ నాయక్, నాయకులు మల్లేష్, నాగరాజు, సైదులు, బి.రాములు, బాలస్వామి, లింగస్వామి, రాము, పరశురాములు పాల్గొన్నారు.

అయ్యప్ప ఆలయంలో అడిషనల్ ఎస్పీ పూజలు

అయ్యప్ప ఆలయంలో అడిషనల్ ఎస్పీ పూజలు

అయ్యప్ప ఆలయంలో అడిషనల్ ఎస్పీ పూజలు