
ఇందిరమ్మ ఇళ్ల పనుల్లో వేగం పెంచండి
అచ్చంపేట: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని.. పెండింగ్ బిల్లులు, ఇతర సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. మంగళవారం పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రజా భవన్‌లో జిల్లా గృహనిర్మాణశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.