
అంతా మాయ!
జిల్లాలో మంత్రాలు, మాయల పేరుతో పెట్రేగిపోతున్న కేటుగాళ్లు
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలో మాయలు, మంత్రాల పేరుతో అమాయకులకు వల వేస్తున్న కేటుగాళ్లు అందిన కాడికి దోచుకుంటున్నారు. ఈ క్రమంలో వివిధ సమస్యలతో తమను ఆశ్రయించే మహిళలను మాయచేసి తమ వైపునకు తిప్పుకొంటున్నారు. ఎదురు తిరిగిన వారిని హతమార్చేందుకు సైతం వెనకాడటం లేదు. జిల్లాకేంద్రం సమీపంలోని గుడిపల్లి శివారులో అనుమానాస్పదంగా మరణించిన శ్రీపురం గ్రామానికి చెందిన రాములు ఉదంతంలోనూ ఇలాంటి కేటుగాడి హస్తమే ఉన్నట్టు తేలింది. జిల్లాలో గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోగా.. మళ్లీ పునరావృతం అవుతుండటం జిల్లాలో ప్రబలుతున్న మూఢనమ్మకాల జాడ్యానికి అద్దం పడుతోంది.
తమకు అతీత శక్తులు ఉన్నాయంటూ అమాయకులకు వల
ఎదురు తిరిగే వారిని హతమార్చేందుకు వెనకాడని వైనం
తాజాగా శ్రీపురం గ్రామవాసి రాములు మృతి కేసులో కొత్త కోణం