
పేదరిక నిర్మూలనే ధ్యేయం
మన్ననూర్/అమ్రాబాద్: నిరుపేద కుటుంబాలను సామాజికంగా, ఆర్థికంగా సుస్థిరత్వం సాధించేందుకు గ్రాడ్యుయేట్ అప్రోచ్ కీలకంగా వ్యవహరిస్తుందని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈఓ దివ్య దేవరాజన్ అన్నారు. మంగళవారం పదర మండలం పెట్రాల్‌చేన్ చెంచుపెంటలో ఇంటర్నేషనల్ బ్లాక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సామెరన్ అబేద్‌తో కలిసి సెర్ప్ సీఈఓ పర్యటించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలు, వీఓఏలు, దివ్యాంగ సంఘాల స్థితిగతులను తెలుసుకున్నారు.పేదరిక నిర్మూలన కోసం తెలంగాణ సమ్మిళిత జీవనోపాధి కార్యక్రమం ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను చెంచులకు వివరించారు. అదే విధంగా మన్ననూర్‌లోని రైతువేదికలో చెంచు మహిళా సంఘాల సభ్యులతో ఏర్పాటుచేసిన సమావేశంలో సీఈఓ మాట్లాడారు. గ్రాడ్యుయేట్ అప్రోచ్ ద్వారా కొలాం, చెంచు, జోగిని వంటి తెగలు 36 నెలల వ్యవధిలో పేదరికం నుంచి పురోభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు, ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు.