
ఇంక్యూబేషన్ సెంటర్..
ల్యాబ్‌తోపాటు ఇంక్యూబేషన్ సెంటర్‌ను కూడా అధికారులు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో నూతనంగా ఆవిష్కరణలు చేసే స్టార్టప్‌లు ప్రారంభించే వారు ఇక్కడ ప్రయోగాలు చేసుకునేందుకు ఆస్కారం ఉంది. ప్రయోగాల్లో ప్రొటోటైప్ ఆవిష్కరణలు చేసేందుకు, చేర్పులు, మార్పులు చేసేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడనున్నాయి. వీటితోపాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని వివిధ ప్రైవేటు కంపెనీలు, ఫార్మాలు సైతం అత్యంత ఖరీదైన ప్రయోగాలను ఇక్కడ కొద్దిపాటి ఫీజులు చెల్లించి చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. ఇక్కడ అత్యంత ఖరీదైన ల్యాబ్ ఎక్విప్‌మెంట్ ఉండటంతో ఎలాంటి ప్రయోగాలనైనా తక్కువ ఖర్చుతో చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది. దీనివల్ల యూనివర్సిటీకి సైతం ఆదాయం సమకూరనుంది. కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి స్కిల్ డెవలప్‌మెంట్ కోసం శిక్షణ సైతం ఇందులో ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.