
సాంకేతిక విద్యతో ఉపాధి అవకాశాలు..
కల్వకుర్తి టౌన్: సాంకేతిక విద్యతో స్వయం ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. కల్వకుర్తిలోని ఐటీఐ కళాశాలలో నూతనంగా ఏర్పాటుచేసిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించేందుకు సాంకేతిక విద్య ఎంతో అవసరమన్నారు. ఏటీసీలో అభ్యసిస్తున్న విద్యార్థులు శ్రద్ధగా, క్రమశిక్షణతో నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని సూచించారు. కేవలం ఉద్యోగాల కోసమే కాకుండా స్వయం ఉపాధి రంగాల యజమానులుగా ఎదగాలని అన్నారు. కాగా, ఏటీసీలో మోటార్ వెహికిల్, డీజిల్, పెట్రోల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వాహనాల రిపేరింగ్‌పై ప్రత్యేక శిక్షణ పరికరాలను విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఆయన వెంట ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ జయమ్మ, తహసీల్దార్ ఇబ్రహీం తదితరులు ఉన్నారు.