
పొగాకుతో ఆరోగ్యానికి ముప్పు
బిజినేపల్లి: పొగాకు ఉత్పత్తుల వినియోగంతో ఊపిరితిత్తుల సమస్యలతో పాటు క్యాన్సర్, గుండెపోటు వంటి వ్యాధులకు గురవుతారని.. లైంగిక సామర్థ్యం, పునరుత్పత్తి శక్తి తగ్గుతుందని డీఎంహెచ్‌ఓ డా.రవికుమార్ నాయక్ అన్నారు. నేషనల్ టుబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్, ప్రపంచ మానసిక నిర్మూలన వారోత్సవాలను పురస్కరించుకొని గురువారం జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో పాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. విద్యార్థులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు రోజు ధ్యానం, యోగా చేయాలని సూచించారు. కార్యక్రమంలో సైక్రియాటిస్టు హెచ్‌ఓడీ డా.ఫణికాంత్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రాజగోపాలాచారి, పాలెం పీహెచ్‌సీ వైద్యాధికారి డా.ప్రియాంక, సిబ్బంది విజయ్‌కుమార్, బాదం రాజేశ్, మల్లేశ్, గోవర్దన్, జగవర్దనమ్మ తదితరులు పాల్గొన్నారు.