
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
పెంట్లవెల్లి: మండలంలోని జటప్రోల్ గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో బుధవారం మంత్రి జూపల్లి, కలెక్టర్ బాదావత్ సంతోష్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం పర్యటన సజావుగా జరగడానికి శాఖల వారీగా అధికారులు బాధ్యతలు అప్పగించాలని కలెక్టర్‌కు సూచించారు. శుక్రవారం నిర్వహించే సభకు జిల్లా నలుమూలల నుంచి 70 వేల మంది పాల్గొంటారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు ప్రణాళికలు చేసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. పర్యటనలో ఎలాంటి లోపాలు లేకుండా టెంట్లు, స్టేజీ, రోడ్డు మార్గం, విద్యుత్ సరఫరా, తాగునీటి సదుపాయం, లైట్లు, టాయిలెట్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు సూచించారు.
అధికారులతో సమీక్ష
సీఎం పర్యటకు కావాల్సిన ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ బదావత్ సంతోష్ సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా పని విభజన చేసుకోవడంతో పాటు ఒకరినొకరు సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. హెలిప్యాడ్ వద్ద, సభాస్థలి పరిసరాల్లో భద్రతా సిబ్బంది నిరంతరం గస్తీ చేయాలని సూచించారు. ప్రోటోకాల్ విషయంలో అధికారులు జాగ్రత్తలు పాటించాలన్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నర్సింహయాదవ్, నాయకులు రామన్‌గౌడ్, గోవింద్‌గౌడ్, నల్లపోతుల గోపాల్, నాగిరెడ్డి, భీంరెడ్డి, కబీర్, బాలరాజు పాల్గొన్నారు.
రేపు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
సభా స్థలాన్ని పరిశీలించిన మంత్రి జూపల్లి, కలెక్టర్ బాదావత్ సంతోష్