
ఆర్టీసీ ఉద్యోగుల సొంతింటి కల సాకారం
కల్వకుర్తి రూరల్: ఆర్టీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఆర్టీసీ కాలనీ ఏర్పాటు చేసుకొని ఉద్యోగులు తమ సొంతింటి కలను సాకారం చేసుకోవడం శుభ సూచకమని రీజినల్ మేనేజర్ సంతోష్ కుమార్ అన్నారు. కల్వకుర్తి మండలం తాండ్ర సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఆదివారం ఆర్టీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగుల ఇళ్ల నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆర్‌ఎం మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి తమవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని ఆర్టీసీ ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎం సుభాషిణి, అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ మహమ్మద్, యూనియన్ బ్యాంక్ మేనేజర్ శంకర్, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ సభ్యుడు గుమ్మకొండ రాములు, మాజీ సర్పంచ్ ఆనంద్, సీఎల్ శ్రీనివాస్ యాదవ్, అబ్రహం, మల్లేశం, విజయబాబు, సాయిరెడ్డి పాల్గొన్నారు.