
విధుల్లో చేరిన జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్
కందనూలు: జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా టి.ఉషారాణి గురువారం బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ జీఎంసీ ఆస్పత్రి పిడియాట్రిక్ విభాగంలో పనిచేస్తున్న ఆమె బదిలీపై నాగర్‌కర్నూల్ జిల్లా జనరల్ ఆస్పత్రికి వచ్చారు. ఇక్కడ సూపరింటెండెంట్‌గా పనిచేసిన రఘు ఆమెకు స్వాగతం పలికి బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఉషారాణి మాట్లాడుతూ.. ఆస్పత్రికి వచ్చే ప్రజలకు వైద్యులు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
క్రీడా అకాడమీలో
ప్రవేశాలు
కందనూలు: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గచ్చిబౌలి ఎల్‌బీ స్టేడియంలో నూతనంగా ఏర్పాటుచేసిన క్రీడా అకాడమీలో 2025–26 విద్యా సంవత్సరం బాలబాలికలకు ప్రవేశాలు కల్పిస్తున్నట్లు డీవైఎస్‌ఓ సీతారాం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హాకీ, అథ్లెటిక్స్, హ్యాండ్‌బాల్, పుట్‌బాల్ క్రీడాంశాల్లో ప్రవేశాల ఈ నెల 15, 16 తేదీల్లో ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు విద్యార్హత, జనన, క్రీడా ధ్రువపత్రాలు, ఆధార్‌కార్డు, 10 పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతో ఉదయం 7గంటలకు ఎల్‌బీ స్టేడియానికి చేరుకోవాలని సూచించారు.
అధిక సాంద్రత పద్ధతితో అధిక దిగుబడి
బిజినేపల్లి: అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగుతో అధిక దిగుబడి సాధించవచ్చని పాలెం కేవీకే శాస్త్రవేత్త డా.శైల అన్నారు. గురువారం మండలంలోని అల్లీపూర్, పోలేపల్లి, నందివడ్డెమాన్, మహదేవునిపేట గ్రామాల్లో పత్తి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా అధిక సాంద్రత పద్ధతిలో సాగుచేసిన పత్తిపంట మొక్కల సంఖ్యను లెక్కించారు. ఈ పద్ధతిని అనుసరించిన రైతుల అభిప్రాయాలు తీసుకున్నారు. యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు.
విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు
నాగర్‌కర్నూల్: విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటామని ఎస్‌ఈ వెంకటనర్సింహారెడ్డి అన్నారు. విద్యుత్‌శాఖ ఎస్‌ఈగా గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం విలేకర్లతో మాట్లాడారు. విద్యుత్ సరఫరాలో తలెత్తే సమస్యలను ముందుండి పరిష్కరిస్తామని తెలిపారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. కాగా, గతంలో ఇక్కడ ఎస్‌ఈగా పనిచేసిన పాల్‌రాజ్ హైదరాబాద్‌లోని కార్పొరేషన్ కార్యాలయానికి బదిలీ కాగా.. ఆయన స్థానంలో మేడ్చల్ ఎమ్మార్టీ డీఈగా పనిచేస్తున్న వెంకట నర్సింహారెడ్డి ఇక్కడికి బదిలీపై వచ్చారు.

విధుల్లో చేరిన జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్

విధుల్లో చేరిన జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్