
ఉచిత న్యాయ సేవలు వినియోగించుకోవాలి
కల్వకుర్తి టౌన్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందించే ఉచిత న్యాయ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని ఆ సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా సూచించా రు. బుధవారం పట్టణంలోని ఓల్డేజ్ హో మ్, సబ్‌జైలులో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముందుగా ఓల్డేజ్ హోమ్ సందర్శించి సమస్య ల ను తెలుసుకున్నారు. అక్కడ కల్పిస్తున్న వసతులపై ఆరా తీశారు. వృద్ధుల కోసం వండిన ఆహారాన్ని పరిశీలించి, పలు సూచనలు చేశారు. అనంతరం సబ్‌జైలును ఆమె పరిశీలించారు. ఖైదీలతో స్వయంగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మెనూ ప్రకారం ఖైదీలకు భోజనం అందించాలని జైలు సూపరింటెండెంట్ చంద్రశేఖర్‌కు సూచించారు. ఎవరికై నా న్యాయవాదిని పెట్టుకునే ఆర్థిక స్థోమత లేకపోతే.. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున న్యాయవాదిని నియమిస్తామని తెలిపారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఓల్డేజ్ హోమ్ నిర్వాహకుడు వెంకటయ్య పాల్గొన్నారు.