
స్వచ్ఛతపై సర్వే
వెల్దండ: స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగంగా మంగళవారం వెల్దండ మండలం రాచూర్‌లో పరిసరాల శుభ్రతపై అధికారులు సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీడీ చంద్రశేఖర్, స్వచ్ఛ సర్వేక్షన్ జిల్లా కోఆర్టినేటర్ ఊశన్న, స్వచ్ఛ గ్రామీణ ఆర్‌ఐ లింగమయ్య గ్రామంలో పర్యటించి వ్యక్తిగత మరుగుదొడ్లు, తాగునీటి సరఫరా, పరిసరాల శుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. పూర్తి సర్వే అనంతరం గ్రేడింగ్ ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీఓ లక్ష్మణ్, మురారి, దేవేందర్, క్రాంతి, కార్యదర్శి పద్మ, నందకిషోర్, విష్ణు, మంజుల, హజిబాబా పాల్గొన్నారు.