
వైఎస్సార్ సేవలు మరువలేనివి
కొల్లాపూర్: జిల్లావ్యాప్తంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కొల్లాపూర్‌లోని క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాఽభివృద్ధికి వైఎస్సార్ చేసిన కృషిని వారు కొనియాడారు. జలయజ్ఞం కార్యక్రమంతో ఎంజీకేఎల్‌ఐతో పాటు అనేక ప్రాజెక్టుల నిర్మాణాలకు ఆయన బీజం వేశారని వివరించారు. వైఎస్సార్ అమలుచేసిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.