
అతివల ఆర్థికాభివృద్ధికి బాటలు
అచ్చంపేట: మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అతివల ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తోందని అచ్చంపేట ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. మెప్మా ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని బీఆర్ అంబేడ్కర్ ప్రజా భవన్‌లో మహిళా సంఘాల సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మహిళా సాధికారిత కోసం సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. ఇందిరా మహిళాశక్తి పథకం ద్వారా మహిళలను వ్యాపార రంగంలో ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. స్వయం ఉపాధి యూనిట్లను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని మహిళా సంఘాల సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, మార్కెట్ చైర్‌పర్సన్ రజిత, సీబీఎం ట్రస్టు చైర్‌పర్సన్ చిక్కుడు అనురాధ, మల్లేష్, కౌన్సిలర్ సునీత పాల్గొన్నారు.