
కళ్లను అశ్రద్ధ చేయొద్దు
నాగర్‌కర్నూల్ క్రైం: ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆరు నెలలకోసారి కంటి పరీక్షలు చేయించుకోవాలని డీఎంహెచ్‌ఓ డా.స్వరాజ్యలక్ష్మి సూచించారు. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ భవనంలో గురువారం జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో కంటివైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్లను అశ్రద్ధ చేయొద్దన్నారు. ఎవరికై నా కంటి సమస్యలు ఉంటే వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించాలని సూచించారు. శిబిరంలో మొత్తం 120 మందిని పరీక్షించి.. 46 మందికి శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించినట్లు డీఎంహెచ్‌ఓ తెలిపారు. కంటి పొర, క్యాటరాక్ట్ సమస్యలతో బాధపడుతున్న వారిని ప్రత్యేక అంబులెన్స్‌లో మహబూబ్‌నగర్ ఏనుగొండలోని లయన్ రామిరెడ్డి కంటి ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా.వెంకటదాసు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. రవికుమార్ నాయక్, ఆప్తాలమిక్ అధికారి కొట్ర బాలాజీ, కుమార్, శ్రీను, సురేశ్ పాల్గొన్నారు.