
పేదల సంక్షేమమే ధ్యేయం
కొల్లాపూర్/కొల్లాపూర్ రూరల్/పెద్దకొత్తపల్లి: పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం పెద్దకొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయంలో 90మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అంతకు ముందు గాంధీజీ విగ్రహం, తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకంతో పేదింటి ఆడబిడ్డల పెళ్లికి అండగా నిలుస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన ఘటన సీఎం రేవంత్‌రెడ్డికే దక్కిందన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని.. అర్హులైన పేదల సొంతింటి కలను సాకారం చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందన్నారు.
● యోగా సాధనతో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం పొందవచ్చని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో కొల్లాపూర్‌లోని వాసవీమాత ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి.. విద్యార్థులు, ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ ఘనమైన వారసత్వ సంపద యోగా అని అన్నారు. మానసిక ఒత్తిడి, శారీరక రుగ్మతల నివారణకు యోగా దోహద పడుతుందన్నారు. ప్రతి ఒక్కరికీ యోగాసనాలపై అవగాహన ఉండాలని అన్నారు. కార్యక్రమాల్లో మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ దండు నర్సింహ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కృష్ణయ్య, సింగిల్‌విండో చైర్మన్ శ్రీనివాసులు, మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్‌రావు, రాజు, గోపాల్‌రావు, విష్ణు, సత్యం, రవికుమార్, కొండల్‌రావు, రాజేశ్వర్‌రావు, ఇమాన్‌గౌడ్, బోజ్యా నాయక్, ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు
ఆరు గ్యారంటీల అమలు
రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు