పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు
నాగర్‌కర్నూల్: ప్రజా ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. నియోజకవర్గంలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా తాను కృషి చేస్తున్నట్లు చెప్పారు. పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు పొందుతున్నారని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, మాజీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


