
దాబాలు సైతం కిక్కిరిసి..
సాక్షి, నాగర్‌కర్నూల్/ కందనూలు/ నాగర్‌కర్నూల్ రూరల్: జిల్లాకేంద్రంలోని పలు వైన్‌షాపుల వద్ద సాయంత్రం అయితే చాలు మందుబాబులు రోడ్లపైనే తిష్టవేస్తున్నారు. నిబంధనల ప్రకారం వైన్‌షాపు పక్కనే ఉండే పర్మిట్ రూముల్లోనే మద్యం తాగాల్సి ఉన్నా.. వైన్‌షాపుల ఎదుట రోడ్లపైకి వచ్చి బహిరంగంగా మద్యం తాగు తున్నారు. జిల్లాలోని వైన్‌షాపులు చాలావరకు ఇళ్ల మధ్య, రోడ్లపైనే ఉన్నాయి. బస్టాండ్, ప్రధాన చౌరస్తాలు, ప్రధాన రోడ్లకు పక్కనే ఉన్న వైన్‌షాపుల వద్ద రోడ్డుపైనే తిష్టవేసి మరీ మందుబాబులు బహిరంగంగా మద్యం తాగుతున్నారు. వైన్‌షాపుల ముందే ఓపెన్ సిట్టింగ్‌లు ఏర్పాటు చేస్తుండటంతో ఆ రోడ్ల మీదుగా వెళ్లేందుకు మహిళలు, చిన్నారులు జంకుతున్నారు.
కరువైన పర్యవేక్షణ..
జిల్లాకేంద్రంలో బార్లు, పర్మిట్‌రూములతోపాటు దాబాలకు తేడా లేకుండా పోయింది. వైన్ షాపుల ఎదుట, సమీప ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో చికెన్, మటన్ వంటకాలతో దాబాలు వెలిశాయి. ఇవన్నీ ఓపెన్ సిట్టింగ్‌లకు అడ్డాలుగా మారాయి. దాబాలు, హోటళ్లు అనే తేడా లేకుండా మందుబాబులు, బహిరంగంగా మద్యపానం, సీసాల గుట్టలతో బార్లు, పర్మిట్ రూములను తలపిస్తున్నాయి. కాలనీలు, ఇళ్ల మధ్యే వైన్‌షాపులు, దాబాలు ఉండటంతో చుట్టుపక్కల వారు ఇక్కట్ల పాలవుతున్నారు.
వైన్ షాపుల ఎదుటే యథేచ్ఛగా
మందుబాబుల సిట్టింగ్‌లు
అడ్డదిడ్డంగా వాహనాల పార్కింగ్‌తో రాకపోకలకు అంతరాయం
ఇళ్ల మధ్యే విక్రయాలతో బయటకు వెళ్లేందుకు జంకుతున్న మహిళలు
జిల్లాకేంద్రంలోని వైన్‌షాపుల వద్ద భయానక పరిస్థితులు

దాబాలు సైతం కిక్కిరిసి..