
నిర్లక్ష్యం వహించారు..
కేంద్ర ప్రభుత్వం శ్యాంప్రసాద్ ముఖర్జీ రూర్బన్ పథకం కింద రూ.30 కోట్లు మంజూరు చేసింది. అభివృద్ధి పనుల కోసం మంజూరైన నిధులతో పనులు పూర్తిచేయడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహించారు. చాలావరకు పనులు పూర్తికాకుండానే కాంట్రాక్టర్లకు నిధులు కట్టబెట్టారు. మండలంలో కోల్డ్ స్టోరేజీలు, వృద్ధాశ్రమం, డంపింగ్ యార్డు తదితర నిర్మాణాలు ప్రారంభించలేదు.
– పరశురాముడు, బీజేపీ అధ్యక్షుడు, పెద్దకొత్తపల్లి మండలం
అనుకూలంగా లేక ఇబ్బంది పడుతున్నాం..
పశువైద్య కేంద్రం నిర్వహణకు అనువైన స్థలం ఏది లేకపోవడంతో పక్కనే ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ భవనంలోకి మార్చారు. అక్కడే ట్రేవిస్ అమర్చి పశువులకు చికిత్సలు నిర్వహిస్తున్నారు. ఇది రోడ్డుపై ఉండడం వల్ల చికిత్స అందించే సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎక్కువ మొత్తంలో వస్తే పశువులకు చికిత్సలు చేయడం కష్టం. ఐదారు గ్రామాలకు చెందిన రైతులు ఇక్కడికే వస్తారు. పక్కా భవన నిర్మాణం ఐదారేళ్లుగా లెంటల్ లెవల్‌లోనే ఆగిపోయింది. దాని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు
– దండె కృష్ణయ్య, వెన్నాచేడ్
కాంట్రాక్టర్ల వల్లే..
పెద్దకొత్తపల్లి మండలంలో రూర్బన్ మిషన్ కింద మంజూరైన నిధులను చాలా వరకు వినియోగించుకున్నాం. గ్రామ పంచాయతీ భవనాలు, సీసీరోడ్లు, పార్కులను అభివృద్ధి చేశాం. కొన్ని పనులు కాంట్రాక్టర్ల జాప్యం వల్ల పూర్తికాలేదు. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తిచేయించాం.
– చిన్న ఓబులేసు,
డీఆర్‌డీఓ, నాగర్‌కర్నూల్
●

నిర్లక్ష్యం వహించారు..