
భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి
కోడేరు: రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకు భూ భారతి చట్టం తీసుకొచ్చామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం మండల కేంద్రంలో భూ భారతిపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. భూ భారతి చట్టం రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని.. ధరణిలో సాధ్యం కాని భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని తెలిపా రు. కొత్త చట్టం ద్వారా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్, ఆర్వోఆర్ మార్పులు, చేర్పులు సులభమవుతుందన్నారు. రైతులు తమ భూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టంతో భూ వివాదాలు శాశ్వతంగా పరిష్కారమవుతాయని చెప్పారు. 17 రాష్ట్రాల్లో నిపుణులు అధ్యయనం చేసి సమగ్ర అంశాలను పొందుపరుస్తూ రైతు ప్రయోజనాలేఽ ధ్యేయంగా భూ భారతి రూపొందించారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ బన్సీలాల్, తహసీల్దార్ విజయ్‌కుమార్, మాజీ ఎంపీపీ కొత్తరామ్మోహన్‌రావు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
రెవెన్యూ అధికారులు న్యాయంగా పరిష్కరించాలి..
కొల్లాపూర్ రూరల్: రైతుల భూ సమస్యలను రెవెన్యూ అధికారులు న్యాయంగా పరిష్కరించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం పట్టణంలోని వాసవి కల్యాణ మండపంలో భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయనతో పాటు కలెక్టర్ బదావత్ సంతోష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భూ సమస్యల పరిష్కారానికి ఈ చట్టం ఎంతో ఉపయోగపడుతుందని, రైతులు రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేయకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత చట్టంతో రైతుల సమస్యలకు 30 రోజుల్లో పరిష్కారం దొరుకుందన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ బన్సీలాల్, తహసీల్దార్ విష్ణువర్ధన్‌రావు, మాజీ సర్పంచ్‌లు మేకల నాగరాజు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు హనుమంత్‌నాయక్, మాజీ కౌన్సిలర్లు, రైతులు, మహిళలు పాల్గొన్నారు.