
ఫిట్‌లెస్ బస్సులు
ఈ నెల 16 నుంచి మొదలైన ప్రైవేట్ బస్సుల సామర్థ్య పరీక్షలు
● ఉమ్మడి జిల్లాలో 1,383 బస్సులకు గాను 245 పూర్తి
● కండీషన్లో లేని వాహనాలు వెనక్కి పంపాలని నిర్ణయం
● ఫిట్నెస్ పరీక్షలకు రాకుండానే నడిపిస్తున్న వైనం
● విద్యార్థుల సంరక్షణ బాధ్యత యాజమాన్యాలదే
ప్రైవేట్ విద్యాసంస్థల బస్సుల ఫిట్నెస్ విషయంలో కొందరు అధికారులు ఉదాసీనంగా, ఏజెంట్లు చెప్పినట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 2024– 25లో దాదాపు వందకు పైగా బస్సులు ఫిట్నెస్ పరీక్షలు చేసుకోకుండానే విద్యార్థులను తరలించినట్లు తెలుస్తోంది. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి అర్హత పత్రాలు తీసుకోవాల్సిన కొందరు యాజమాన్యాలు మరమ్మతు ఇతర కారణాలతో ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవడం లేదు. విద్యాసంస్థల బస్సులన్నీ నిబంధనల మేరకు వసతులు కల్పించి ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకోవాలి. బస్సుల నిర్వహణకు సంబంధించి విద్యార్థుల పూర్తి సంరక్షణ బాధ్యత తమదేనంటూ పాఠశాల యాజమాన్యాలు రవాణా శాఖకు హామీపత్రం సమర్పించాలి.
కచ్చితంగా ఉండాల్సినవి..
● ప్రతి స్కూల్ బస్సులో అవసరమైన మందులు, పరికరాలతో కూడిన ప్రథమ చికిత్స పెట్టె ఉండాలి.
● బస్సులో తప్పకుండా యూనిఫాం ధరించిన ఒక అటెండర్‌ను ఉంచాలి. బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థుల పూర్తి వివరాలు, విద్యార్థి ఎక్కాల్సిన, దిగాల్సిన ప్రదేశాలు నమోదు చేయాలి.
● బస్సులో ఉన్న విద్యార్థులు కిందకు దిగే సమయంలో డ్రైవర్‌కి వారు కనిపించేలా మిర్రర్ ఏర్పాటు చేయాలి.
● ముఖ్యంగా బస్సు ఇంజిన్ కంపార్ట్మెంట్లో తప్పనిసరిగా అగ్నిమాపక పరికరం ఉండాలి.
● బస్సులో సీట్ల కింద విద్యార్థుల బ్యాగులు పెట్టుకునేందుకు గాను ర్యాక్ ఏర్పాటు చేయాలి.
● బస్సు పాఠశాల కమిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. తయారీ సంవత్సరం నుంచి 15 ఏళ్లు మించరాదు.
● ప్రతి బస్సుకు చేతి బ్రేకు, పూర్తిస్థాయిలో బీమా, రవాణా పన్నులు చెల్లించి ఉండాలి.
● బస్సు అద్దాలకు అనుకుని అడ్డంగా ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేయాలి.
● నాణ్యమైన ఇంజిన్, స్టీరింగ్, రూఫ్, టైర్లు తదితర ప్రభుత్వం గుర్తించిన పూర్తి సౌకర్యాలు కల్పించాలి.
● విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేలా తక్కువ ఎత్తులో సీట్లు బిగించాలి.
కఠినంగా వ్యవహరిస్తేనే..