
చదువుతోనే ఉన్నత శిఖరాలకు..
నాగర్‌కర్నూల్ క్రైం: విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ న్యాయమూర్తి నసీం సుల్తానా కోరారు. సోమవారం జిల్లాకేంద్రం సమీపంలోని కొల్లాపూర్ క్రాస్‌రోడ్‌లో ఉన్న జ్ఞానేశ్వర వాత్సల్య మందిరం అనాథ ఆశ్రమాన్ని ఆమె సందర్శించి నిర్వాహకులతో మాట్లాడి మౌలిక వసతులపై ఆరా తీశారు. ప్రతి చిన్నారితో వ్యక్తిగతంగా మాట్లాడి సమస్యలుంటే న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని చెప్పారు. విద్యార్థులు తమ జీవిత లక్ష్యాన్ని ఎంచుకొని సాధనకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యుడు మధుసూదన్‌రావు, శ్రీరామ్ ఆర్య, పవనశేషసాయి తదితరులు పాల్గొన్నారు.