
వివరాలు సరిపోల్చుతూ..
ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు, యూడైస్‌లో పొందుపరిచిన వివరాలకు సరిపోతున్నాయా.. లేదా.. పరిశీలించేందుకు జిల్లావ్యాప్తంగా బుధవారం సర్వే ప్రారంభించారు. డీఎడ్ విద్యార్థులు యూడైస్ సమగ్ర సమాచారాన్ని తెలిపే స్కూల్స్ రిపోర్టు కార్డు ఆధారంగా వివరాలు పరిశీలిస్తున్నారు. ఎంఈఓ కార్యాలయంలో కొనసాగుతున్న ఈ సర్వేలో హెచ్‌ఎంలను ప్రశ్నించే అధికారం సైతం వీరికి ఇచ్చారు. ఇప్పటికే వీరికి పాఠశాల విద్యాశాఖ ప్రశ్నావళి కూడా ఇచ్చింది. మౌలిక వసతులు, పాఠ్య పుస్తకాల పంపిణీ, యూనిఫాంల వివరాలు ఇందులో ఉన్నాయి. స్కూళ్లలో ఉన్నవన్నీ యూడైస్‌లో నమోదు చేశారా.. ప్రధానంగా పాఠశాలలో నమోదైన విద్యార్థులు అదే పాఠశాలలో చదువుతున్నారా..? ఉపాధ్యాయుల సంఖ్య, తరగతి గదులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగునీటి వసతి, వంటగది, విద్యుత్, ఫర్నిచర్, గ్రంథాలయాలు, ప్రయోగశాలలు, డిజిటల్ తరగతి గదులు, క్రీడా మైదానం వంటి వివరాలు, మైనర్, మేజర్ మరమ్మతు నమోదులో పారదర్శకతను పరిశీలిస్తున్నారు. ఆయా వసతులను యూడైస్ వివరాలతో సరిపోల్చుతున్నారు.