
నేటినుంచి అగ్నిమాపక వారోత్సవాలు
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలో సోమవారం నుంచి 20 వరకు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు అగ్నిమాపక శాఖ అధికారి కృష్ణమూర్తి తెలిపారు. ఆదివారం జిల్లాకేంద్రంలో అదనపు కలెక్టర్ అమరేందర్ అగ్నిమాపక శాఖ వారోత్సవాలకు సంబంధించిన వాల్‌పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజుల పాటు ప్రజలకు అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తామని చెప్పారు.