
కొల్లాపూర్‌లో అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్: అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం కొల్లాపూర్‌లో ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. దళిత సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ అడుగడుగునా అవమానాలు ఎదురైనా లెక్కచేయకుండా స్వయంకృషి, స్వీయ ప్రతిభతో అంబేడ్కర్ అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. అణగారిన వర్గాల కు రాజ్యాంగబద్ధంగా హక్కులు కల్పించేందుకు ఆ యన చేసిన పోరాటం ఎనలేనిదని కొనియాడారు.
వంద పడకల ఆస్పత్రి పనుల పరిశీలన..
పట్టణ సమీపంలో చేపట్టిన వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రి భవన నిర్మాణ పనులను మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌తో పనుల పురోగతిని తెలుసుకున్నారు. ఆస్పత్రి భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి వివరించారు. మాతా శిశు సంరక్షణ ఆస్పత్రి సేవలపై కూడా మంత్రి ఆరా తీశారు. మంత్రి వెంట కాంగ్రెస్ నాయకులు హన్మంతునాయక్, నాగరాజు, నర్సింహారావు, రహీంపాషా ఉన్నారు.
బాబాసాహెబ్ ఆశయ సాధనకు
పాటుపడదాం
నాగర్‌కర్నూల్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లి పాటించినప్పుడే ఆయనకు ఘననివాళి అర్పించినట్లు అవుతుందని కలెక్టర్ పి.ఉదయ్‌కుమార్ అన్నారు. ఆదివారం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ ప్రజల మనోభావాలు, స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని అంబేడ్కర్ రచించిన రాజ్యాంగంతో అందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. అంటరానితనం, అసమానతలను రూపుమాపడం.. స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సౌభాతృత్వాన్ని సమానంగా అనుభవించే విధంగా రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన మహానుబావుడని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ అధికారి రాంలాల్ తదితరులు పాల్గొన్నారు.
అంటరానితనంపై అలుపెరుగని పోరాటం..
నాగర్‌కర్నూల్ క్రైం: అంటరానితనంపై అలుపెరుగని పోరాటం చేసి, అణగారిన వర్గాల ఆరాధ్య దైవంగా బీఆర్ అంబేడ్కర్ కీర్తించబడుతున్నారని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రామేశ్వర్, అడ్మిన్ జగన్, ఆర్‌ఐ గౌస్‌పాషా పాల్గొన్నారు.
ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేస్తున్న కలెక్టర్ ఉదయ్‌కుమార్