
మాట్లాడుతున్న జిల్లా ప్రధానన్యాయమూర్తి రాజేష్‌బాబు
నాగర్‌కర్నూల్ క్రైం: చట్టం దృష్టిలో అందరూ సమానులేనని, కార్మికులు 8 గంటల పనికి సమాన వేతనం పొందడానికి సీ్త్ర పురుష భేదభావం లేదని ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి రాజేష్‌బాబు అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఆర్టీసీ డిపో ఆవరణలో కార్మికులకు లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ కార్మికులతో 8 గంటలు మాత్రమే పనిచేయించుకోవాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, సీ్త్రపురుషుల వ్యత్యాసం లేకుండా చూసేలా పోరాటాలు చేసి హక్కులను సాధించుకున్నామని చెప్పారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ప్రతి శనివారం ఉచితంగా న్యాయ సేవలు అందిస్తున్నామని, సంవత్సర ఆదాయం రూ.లక్షకు తక్కువ ఉన్న ప్రతిఒక్కరికి తమ హక్కులను కాపాడుకోవడానికి ఎలాంటి సమస్య ఉన్నా లీగల్ సర్వీసెస్ అథారిటీని సంప్రదించి ఉచిత న్యాయాన్ని పొందాలని సూచించారు. ఆర్టీసీ సేవలు ప్రత్యక్షంగా డ్రైవర్, కండక్టర్ ద్వారానే ప్రజలకు కనిపిస్తున్నాయని, కానీ మనకు కనిపించకుండా సేవలు అందిస్తున్న సిబ్బంది చాలామంది ఉన్నారన్నారు. కార్మికులందరూ సమష్టిగా పనిచేసినందుకే రవాణా వ్యవస్థ మనకు సేవలు అందిస్తుందని కొనియాడారు. నాగర్‌కర్నూల్ డిపోలో ప్రజల రవాణాకు ఒక్క ఏసీ బస్ లేదని, వెంటనే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సమావేశంలో ఏజీ శ్యాంసుందర్, మధుసూదన్‌రావు, పీపీలు తిరుపతయ్య, మాధవ లక్ష్మణ్, శ్రీరాం ఆర్య, డిపో మేనేజర్ ధరంసింగ్, కోర్టు సిబ్బంది కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.